మరోసారి బాంబు పేల్చిన ప్రకాశ్ రాజ్.. త్వరలోనే అన్ని చెప్తానని

by  |

దిశ, వెబ్‌డెస్క్ : మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందడంతో ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేయడంతో మంచు విష్ణు స్పందిస్తూ.. అంకుల్ ఐలవ్ యూ మీ నిర్ణయాన్ని నేను స్వాగతించడం లేదు, మీతో కలసి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను అంటూ ప్రకాశ్ రాజ్‌కు చేసిన మెసేజ్‌ను విష్ణు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాజాగా ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్‌లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా అని బాంబు పేల్చాడు.

Next Story