ప్రగ్యా జైశ్వాల్‌‌కు హ్యాండిచ్చిన బాలీవుడ్..

by  |
pragya
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ ప్రగ్యా జైశ్వాల్‌కు బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘అంతిమ్ ది ఫైనల్ ట్రుత్ లో.. ఆయనకు జోడీగా ప్రగ్యాను సెలెక్ట్ చేసిన మేకర్స్, రొమాంటిక్ పోర్షన్స్ అండ్ సాంగ్స్ కూడా షూట్ చేశారట. కానీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న సల్లూ భాయి క్యారెక్టర్ డైల్యూట్ కాకుండా ఉండాలంటే.. ఈ రొమాంటిక్ సీన్స్ అండ్ సాంగ్స్ కట్ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఫైనల్ అవుట్‌‌పుట్ నుంచి తొలగించారట. ఈ విషయాన్ని డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తాజా ఇంటర్వ్యూలో వివరించారు.

ముందుగా సల్మాన్‌కు కథ రాయడమే ఫస్ట్ విక్టరీ అన్న మహేష్ మంజ్రేకర్.. ఇక ఈ రొమాంటిక్ ఎపిసోడ్స్‌ను డిలీట్ చేయడం సెకండ్ విక్టరీ అని అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ప్రగ్యా పోర్షన్‌తో హ్యాపీగా ఉన్నా, సినిమా సక్సెస్ కోసం ఇలా చేయాల్సి వచ్చిందని వివరించాడు. ఈ విషయాన్ని ప్రగ్యాకు చెప్పగా.. పరిస్థితి అర్థం చేసుకున్న హీరోయిన్ ఇందుకు ఓకే చెప్తూ.. మేకర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిందట. మరి సినిమా కోసం టైమ్ కేటాయించిన ప్రగ్యాకు క్రెడిట్ కార్డ్స్‌లో చోటిస్తారో లేదో చూడాలి.

Next Story