లక్ష్మీప్రసన్న తనయకు బాహుబలి సర్‌ప్రైజ్

by  |
లక్ష్మీప్రసన్న తనయకు బాహుబలి సర్‌ప్రైజ్
X

మంచు లక్ష్మి కూతురు.. విద్యా నిర్వాణ జూన్ 16న పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ బెస్ట్ విషెస్ అందించిన లక్ష్మీ ప్రసన్న.. తనను సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో పోల్చింది. తన కూతురు కలలు కన్న, కావాలనుకున్న ప్రతీ ఒక్కటీ తనకు అందాలని కోరుకుంది.

ఈ క్రమంలోనే విద్యకు చాలా ఇష్టమైన వ్యక్తి సర్‌ప్రైజ్ ఇచ్చాడని తెలిపింది లక్ష్మి. బాహుబలి ప్రభాస్ వీడియో కాల్ చేసి విద్యకు విష్ చేశాడని తెలిపింది. దీంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందని.. ఫొటో షేర్ చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపింది. ‘బంగారు తల్లి’ అంటూ మంచు మనోజ్ కూడా తన మేనకోడలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed