'ఓ డియర్‌' : ఓల్డ్ గెటప్‌లో ప్రభాస్

by  |
ఓ డియర్‌ : ఓల్డ్ గెటప్‌లో ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత చేస్తున్న చిత్రం ‘ఓ డియర్’. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రాన్ని ‘జిల్’ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యే జార్జియా షెడ్యూల్ పూర్తి కాగా…. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా… రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సాగనుందని సమాచారం. అయితే సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో డార్లింగ్ లుక్ వెరైటీగా ఉంటుందని తెలుస్తోంది. ఓల్డ్ గెటప్‌లో ప్రభాస్ కొత్తగా కనిపిస్తూ … ప్రేక్షకులకు మరింత కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి కృష్ణం రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

‘బాహుబలి’ తర్వాత రిలీజైన ‘సాహో’ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా… ‘ఓ డియర్’ సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించినా నిరాశే ఎదురైంది. మరి శ్రీరామ నవమికైనా ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులకు పండగ చేసుకునే చాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

Tags : O Dear, Prabhas, Bahubali, Look

Next Story

Most Viewed