ప్రైవేట్ జెట్‌లో ప్రభాస్ చిత్ర బృందం

by  |
ప్రైవేట్ జెట్‌లో ప్రభాస్ చిత్ర బృందం
X

“సాహో” సినిమా అనంతరం తన తర్వాత సినిమాను “జిల్” సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన చిత్రబృందం, ఇటీవల అక్కడ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మంగళవారం ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచమంతటా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జార్జియాలో ఉన్న ప్రభాస్‌, చిత్రబృందం ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఎటువంటి అసౌకర్యమూ లేకుండా చిత్రీకరణ పూర్తి చేసినట్టు దర్శకుడు తెలిపారు. ఆ చిత్రబృందం ఫ్లైట్‌లో వచ్చిన లేటెస్ట్ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధించి.. తమ అభిమాన హీరో ఫస్ట్‌లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ మొన్నటి వరకు తెగ వెయిట్ చేశారు. ఉగాదికి టైటిల్‌తోపాటు, ఫస్ట్ లుక్ రానుండటంతో అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. అయితే, తాజా సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో అప్డేట్లు ఇస్తూ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. జార్జియాలో ఇటీవలే షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. ఈ సందర్భంగా ప్రైవేట్ జెట్‌లో తీసుకున్న ఫొటోను దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రభాస్‌తోపాటు దర్శకుడు రాధాకృష్ణ, చిత్ర నిర్మాత ప్రమోద్, నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు.

tags : saaho, prabhas, young rebel star, director radha krishna, uv creations, private jet



Next Story