ప్రభాస్ సినిమా టైటిల్ చేంజ్..

by  |
ప్రభాస్ సినిమా టైటిల్ చేంజ్..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో భారీ బడ్జెట్, భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ‘సాహో’ సినిమాను మల్టీ లింగ్వల్ గా రిలీజ్ చేశారు. కానీ మిక్స్‌డ్ టాక్‌తో ‘సాహో’ కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. దీంతో ప్రభాస్ వెంటనే ‘జాన్’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా స్టార్ట్ చేశాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఏడాదిలో మరో సినిమాతో వస్తానని ప్రభాస్ ప్రామిస్ చేసినా… అది నిజమయ్యేలా లేదు. జాన్ సినిమా పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

అయితే శర్వానంద్, సమంత కాంబినేషన్ లో తమిళ రీమేక్ ’96’ సినిమా తెలుగులో ‘జాను’ గా రిలీజ్ అయింది. ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా అదే కావడంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారని అభిప్రాయపడ్డారు ఫ్యాన్స్. ప్రభాస్ ‘జాన్’ టైటిల్‌ను మారిస్తేనే బాగుంటుందని అనుకున్నారు. దీంతో యూవీ క్రియేషన్స్ సినిమా పేరు మార్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ‘జాన్’ టైటిట్‌ను ‘ఓ డియర్’ గా చేంజ్ చేసినట్లు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమా పేరు రిజిస్టర్ చేసినట్లు టాక్. కాగా .. యూవీ క్రియేషన్స్ సంస్థను సంప్రదించాకే తమ సినిమాకు ‘జాను’ టైటిల్ ను ఖరాను చేసినట్లు చెప్పారు దిల్ రాజు.

Next Story

Most Viewed