పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రభాకర్ రావు

64
Prabhakar

దిశ,హుజూర్‌నగర్: పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన మాతంగి ప్రభాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన నిజామాబాద్‌లో జరిగిన ఆ సంఘం 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు. తన ఎంపికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష,ప్ర ధాన కార్యదర్శులకు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రామలింగారెడ్డి, గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్యలకు ప్రభాకర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్‌నగర్ డివిజన్‌లో సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రభాకర్ రావు ఎంపిక పట్ల నియోజకవర్గంలోని పీఆర్టీయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..