PPF Scheme: రోజూ రూ.416 సేవ్ చేస్తే… మీరే కోటీశ్వరులు..

by  |
Public Provident Fund
X

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా PPF స్కీమ్ అనేది… అత్యంత రక్షణతో కూడిన పెట్టుబడి అంశం. ఇందులో ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఉంటాయి. మీరు మీ చిన్న చిన్న పొదుపులకు భారీ రిటర్న్ కావాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే… మీకు ఈ స్కీమ్ బాగా పనిచేస్తుంది. కాకపోతే… ఇందులో కాస్తంత ఓపిక అవసరం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో భారీ రిటర్నులు వెంటనే వచ్చేయవు. కానీ కొంతకాలం టైమ్ పట్టినా… కచ్చితంగా వస్తాయి. PPFలో దీర్ఘ కాలిక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు ఉంటాయి. దీని ద్వారా కోటీశ్వరులు కావాలి అనుకునేవారు కచ్చితంగా సహనం, ఓర్పు కలిగి ఉండాలి.

రోజూ రూ.416 సేవ్ చేయడం అంటే… నెలకు సుమారుగా రూ.12,500 సేవ్ చేసినట్లు. అంటే… సంవత్సరానికి రూ.1.5 లక్షలు సేవ్ చేసినట్లు. ఇలా ఈ స్కీమ్‌లో సేవ్ చేస్తూ పోతే… కోటీశ్వరులు కావచ్చు

ప్రస్తుతం PPF అకౌంట్ కింద ప్రభుత్వం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తోంది. ఈ స్కీములో పెట్టుబడిని కనీసం 15 ఏళ్లు పెట్టాల్సి ఉంటుంది. అంటే… మీరు నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడితే… మీరు పెట్టిన మొత్తం రూ.22.5 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ రూ.18,18,209 వస్తుంది. మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ రూ.40,68,209 అవుతుంది

కోటీశ్వరులు కావాలి అనుకునేవారు… 15 ఏళ్ల తర్వాత డబ్బును విత్ డ్రా చేసుకోకూడదు. మరో పదేళ్లపాటూ… కంటిన్యూ చెయ్యాలి. అప్పుడు కోటీశ్వరులు కాగలరు. మెచ్యూరిటీ గడువు తర్వాత మరో ఐదేళ్లలో మీ పెట్టుబడి మొత్తం రిటర్నుతో కలిపి రూ.66,58,288 అవుతుంది. మరో ఐదేళ్లలో అది మరింత పెరుగుతుంది. అంటే… 25 ఏళ్లలో మీకు రిటర్నుతో కలిపి రూ.1,03,08,015 వస్తుంది.

మొత్తంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే… PPF స్కీములో నెలకు రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే… 25 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు

For more viral News : Please Join in Disha viral Group


Next Story

Most Viewed