పవర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్!

by  |
పవర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాగా పవర్ స్టార్ అభిమానులంతా టీజర్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న క్రమంలో చిత్ర యూనిట్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. గురువారం అర్ధరాత్రి 00:00 గంటలకు ‘వకీల్ సాబ్’ అప్‌డేట్‌ ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. దీంతో వకీల్ సాబ్ నుంచి ఏం విడుదల చేస్తారో అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు, బోణి కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed