పవన్ కళ్యాణ్ కి మరోసారి కోవిడ్ టెస్ట్.. రిజల్ట్ ఇదే!

by  |
పవన్ కళ్యాణ్ కి మరోసారి కోవిడ్ టెస్ట్.. రిజల్ట్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. కొన్ని రోజులుగా క్వారంటైన్ లో ఉన్న ఆయన గురువారం మరోసారి కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు. శుక్రవారం దాని ఫలితాలు కోసం పవన్ హాస్పిటల్ కి వెళ్లారు. హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ చేయించుకున్న పవన్ కు నెగిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పవన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడడంతో ఆగిపోయినా షూటింగ్స్ మళ్లీ మొదలు కానున్నాయి. ప్రస్తుతం పవన్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’, మల్టీ స్టారర్ ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇకపోతే పవన్ నటించిన రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఇటీవలే విడుదలై విజయవంతంగా దూసుకెళ్తుంది.

Next Story

Most Viewed