- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ స్టార్ క్రేజ్.. గల్ఫ్‌లో బర్త్ డే వేడుకలు
<p>దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ జనసేన టీం ఆధ్వర్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ దేశమైన బెహరాన్‌లో గురువారం ఉదయం పలుచోట్ల కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు. అనంతరం ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. అంతేగాకుండా.. బర్త్ డే సందర్భంగా బెహరాన్‌లోని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ జనసేన టీం ఆధ్వర్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ దేశమైన బెహరాన్‌లో గురువారం ఉదయం పలుచోట్ల కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు. అనంతరం ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. అంతేగాకుండా.. బర్త్ డే సందర్భంగా బెహరాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు.

సామాన్యులకు సేవ చేయాలన్న జనసేన నినాదంతో మమేకమై తమ వంతు సాయంగా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల, మూలస్థానం గ్రామాల్లో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన 130 మంది పేదలకు రేషన్ కిట్లు పంపించారు. ఈ కార్యక్రమానికి శ్రీరాయుడు వెంకటేశ్వర రావు, ఉప్పుటూరి వెంకటేశ్వర్లు, చీకర్మిల్లి రాజేష్, పంతం శ్రీనివాస్, యండమూరి భరత్ కుమార్, మానేం కిరణ్, గోకమణి శ్రీకాంత్, రాకుర్తి ఆనంద్, కొల్లా హనుమంతరావు, మనపురం సతీష్ కుమార్‌లు ఆర్థికసాయం అందజేశారు.






