- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి: కార్పొరేటర్
<p>దిశ, కూకట్పల్లి: అల్లాపూలర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సబీహా బేగం అన్నారు. డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో మంగళవారం విద్యుత్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహా బేగం మాట్లాడుతూ.. డివిజన్‌లోని కొన్ని కాలనీలు అయ్యప్ప సొసైటీ సెక్షన్ పరిధికి వస్తాయని, ఆయా కాలనీలలో విద్యుత్ సమస్యలు తరచుగా తమ దృష్టికి వస్తున్నాయని ఆమె తెలిపారు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను […]</p>

దిశ, కూకట్పల్లి: అల్లాపూలర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సబీహా బేగం అన్నారు. డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో మంగళవారం విద్యుత్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహా బేగం మాట్లాడుతూ.. డివిజన్‌లోని కొన్ని కాలనీలు అయ్యప్ప సొసైటీ సెక్షన్ పరిధికి వస్తాయని, ఆయా కాలనీలలో విద్యుత్ సమస్యలు తరచుగా తమ దృష్టికి వస్తున్నాయని ఆమె తెలిపారు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు.
ఈ సందర్భంగా ఏడీఈ భాగయ్య మాట్లాడుతూ.. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏడీఈ భాగయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






