ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ‘పోస్కో’ సిద్ధం 

by  |
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ‘పోస్కో’ సిద్ధం 
X

దిశ, ఏపీ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఇక్కడ తమ సంస్థలను నెలకొల్పేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నట్లు సీఎంకు వివరించారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలు నెలకొల్పేందుకు దోహదపడుతున్నట్లు సీఎం చెప్పారు. సీఎం జగన్‌ని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ ఉన్నారు.



Next Story

Most Viewed