- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఆ స్థితిలో దొరికిన మృతదేహం
<p>దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఇటీవల గుండెపోటుతో బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా మృతిచెందిన ఘటన మరువకముందే మరో టీవీ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల(54) ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పలు టీవీ సీరియల్స్ తో బిజీ గా ఉన్న రమేష్ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఇటీవల గుండెపోటుతో బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా మృతిచెందిన ఘటన మరువకముందే మరో టీవీ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల(54) ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పలు టీవీ సీరియల్స్ తో బిజీ గా ఉన్న రమేష్ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని, ఆ ఇబ్బందుల వలనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్నేహితులు తెలుపుతున్నారు. ఇక నటుడి మరణంతో మాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. గత రెండు రోజుల క్రితం సెట్ లో సందడి చేసిన రమేష్.. నేడు జీవచ్ఛవంలా పడి ఉండడం మనుసును కలిచివేస్తోందని నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సంచారమే అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.






