ఇదిగో నా నగ్న దేహం.. ఒంటిపై నూలుపోగు లేకుండా సింగర్ సెల్ఫీ పోస్ట్

by  |
pop singer Lizzo
X

దిశ, సినిమా: పాప్ సింగర్ లిజ్జో లేటెస్ట్ పోస్ట్ వైరల్ అయింది. 32 ఏళ్ల సింగర్ హెవీ బాడీని కలిగి ఉన్నా.. బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అంతే కాదు సూపర్ కాన్ఫిడెన్స్‌తో దూసుకెళ్తు టాప్ సింగర్‌గా కొనసాగుతోంది. తాజాగా డవ్‌తో పెయిడ్ పార్ట్‌నర్ షిప్ అగ్రిమెంట్ చేసుకున్న భామ.. నెటిజన్లకు పాజిటివిటి పంచేందుకు నగ్నంగా ఉన్న పిక్చర్ అప్‌లోడ్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసిన లీజ్జో.. ‘‌టారస్ సీజన్‌కు స్వాగతం. ఈ సీజన్‌ను మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు అన్‌ఎడిటెడ్ సెల్ఫీ పోస్ట్ చేస్తున్నా. సాధారణంగా నా బెల్లీ ఫిక్స్ చేసి, స్కిన్ స్మూత్ చేస్తాను.. కానీ ఈ సారి నేచురల్‌గా నేను ఎలా ఉంటానో చూపించాలి అనుకుంటున్న. సోషల్ మీడియాలో నెగెటివ్ ఎఫెక్ట్స్‌ను రివర్స్ చేసేందుకు డవ్ సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. బ్యూటీ స్టాండర్డ్స్ పై చర్చల్లో మార్పు తెచ్చేందుకు డవ్‌తో చేతులు కలిపాను’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటో పోస్ట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. నిజమైన దేవత అంటూ పొగిడేస్తున్నారు. ఐకానిక్ లేడీ అంటూ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సొసైటీలో పాజిటివ్‌నెస్ క్రియేట్ చేసేందుకు ఇలాంటి పిక్చర్ షేర్ చేయడం గొప్ప విషయమని చెప్తున్నారు.



Next Story