- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయంగా ఉంది : పూజా హెగ్డే
<p>అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ భామ టాలీవుడే కాదు బాలీవుడ్‌పైనా మొదటి నుంచి దృష్టి పెట్టింది. తెలుగులో మూవీలు చేస్తూనే హిందీలోనూ చేస్తూ వచ్చింది. అక్కడా, ఇక్కాడా మంచి గుర్తింపు పొందింది. అయితే, తెలుగులో చేసిన చిత్రాలతో ఈ క్యూట్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీలో అమూల్యగా నటించింది. ఈ మూవీ ఘన విజయం సాధించిన […]</p>

అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ భామ టాలీవుడే కాదు బాలీవుడ్‌పైనా మొదటి నుంచి దృష్టి పెట్టింది. తెలుగులో మూవీలు చేస్తూనే హిందీలోనూ చేస్తూ వచ్చింది. అక్కడా, ఇక్కాడా మంచి గుర్తింపు పొందింది. అయితే, తెలుగులో చేసిన చిత్రాలతో ఈ క్యూట్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీలో అమూల్యగా నటించింది. ఈ మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనకు జోడీగా ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీ చేయడానికి సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా ఆమె మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ గొప్ప నటుడనీ, ఆయనతో నటించడం అంత తేలిక కాదనీ, ఆయన సీనియారిటీ, క్రేజ్ చూస్తే తనకు భయంగా ఉందని అంటోంది. అయితే, ఆయనకు జోడీగా ఛాన్స్ దక్కడం పట్ల ఆనందంగానూ ఉందనీ, ఆయన నుంచి నటనకు సంబంధించిన ఎన్నో మెళకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
Tags: cute heroine, pooja hegde, fear, bollywood, tollywood






