ఆ సినిమా నాకు స్పెషల్ : పూజ హెగ్డే

by  |
ఆ సినిమా నాకు స్పెషల్ : పూజ హెగ్డే
X

దిశ, వెబ్‌డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తాజాగా తెలుగు సినిమాల గురించి నేషనల్ మీడియాతో గొప్పగా చెప్పింది. అంతేకాదు నటిగా తనకు స్పెషల్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది టాలీవుడ్ అని వెల్లడించింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా గురించి ప్రస్తావించిన పూజ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్.. అరవింద సమేత తనకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ అని తెలిపింది.

తొలిసారిగా తారక్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అని.. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ రెండు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చాయని చెప్పింది. డబ్బింగ్ పరంగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న చిత్రం కూడా అరవింద సమేతనే అని తెలిపిన పూజ.. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక తారక్‌తో పాటు తనలో ఉన్న ఎనర్జీ లెవల్స్.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చేలా చేశాయంటూ చెప్పుకొచ్చింది

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పూజ.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను కంప్లీట్ చేసేసింది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళీ’, రణ్ వీర్ సింగ్‌తో ‘సర్కస్’ సినిమా చేయనుంది.


Next Story

Most Viewed