సల్మాన్‌కు ఒక్కసారి నచ్చితే వదిలిపెట్టడు : పూజా హెగ్డే

by  |

దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తమిళ్, తెలుగుతో పాటు హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రత్యేకించి బాలీవుడ్‌లో సల్మాన్ సరసన ‘భాయ్‌జాన్’‌, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చిత్రానికి సైన్ చేసింది. మరోవైపు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ఇళయ దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీస్‌లో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే, కండల వీరుడు సల్మాన్‌తో నటించడం పట్ల ఎగ్జైట్ అవుతున్న బ్యూటీ, తనంటే ఎంత అభిమానమో వెల్లడించింది. సల్మాన్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. ‘తను ఎవరినైనా ఇష్టపడ్డాడంటే, వారిని ఇంకెవరూ అంతలా ఇష్టపడి ఉండరు. ఒకవేళ తను అలా లేకుంటే, మీరు నచ్చలేదని చెప్పొచ్చు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చుతుంది. నిజంగా ఎదుటి వ్యక్తి పట్ల ఇంత నిజాయితీగా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇది చాలా గొప్ప లక్షణం’ అని చెప్పింది. సల్మాన్‌-పూజ మూవీ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా కొవిడ్ కారణంగా వాయిదాపడింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story