‘మాస్టర్’తో బుట్టబొమ్మ రొమాన్స్?

by  |
‘మాస్టర్’తో బుట్టబొమ్మ రొమాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం రికార్డ్స్ సెట్ చేసింది. దీంతో ఒకే సారి రెండు పండుగలు సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్.. అప్పుడే విజయ్ నెక్స్ట్ మూవీ గురించి ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న #Thalapathy65‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా కాస్ట్ అండ్ క్రూ గురించి రూమర్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

విజయ్ తర్వాతి చిత్రంలో చార్మింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ అని ప్రచారం చేస్తున్నారు. బుట్టబొమ్మనే విజయ్‌తో రొమాన్స్ చేయబోతోందని.. అరుణ్ విజయ్ విలన్‌గా సెలెక్ట్ అయ్యాడని కన్ ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని.. అప్పుడే సినిమా షూటింగ్ గురించి మేకర్స్ వివరిస్తారని చెప్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 8న ప్రారంభం అవుతుందని..దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేస్తారని అంటున్నారు. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ పూజా హెగ్డే ఫైనల్ అయితే మాత్రం ఇప్పటికే టాలీవుడ్‌ను ఏలేస్తున్న క్యూట్ బ్యూటీ..ఇక కోలీవుడ్‌ను కూడా ఏలేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Next Story

Most Viewed