- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మాత్రానికే రివాల్వర్‌తో బెదిరించాలా!
<p>దిశ, నల్లగొండ: గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చాడు ఓ వ్యక్తి. చెబితే వినే మనుషులతో మొండిగా ప్రవర్తించాడు. వారిని ప్రాణభయంతో హడలెత్తించాడు.. పరిగెత్తించాడు. చివరికి తాను చేసిన పనికి ప్రతిఫలం కూడా చవిచూశాడు. వివరాళ్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ వద్దనున్న ఓ చెరువులో చేపలు పట్టడానికి పలువురు గ్రామస్తులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చెరువు కాంట్రాక్టర్ ఉపేందర్ రెడ్డి పరుగున అక్కడికి వచ్చి.. ఏకంగా రివాల్వర్ బయటకు తీసి బెదిరించాడు. […]</p>

దిశ, నల్లగొండ: గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చాడు ఓ వ్యక్తి. చెబితే వినే మనుషులతో మొండిగా ప్రవర్తించాడు. వారిని ప్రాణభయంతో హడలెత్తించాడు.. పరిగెత్తించాడు. చివరికి తాను చేసిన పనికి ప్రతిఫలం కూడా చవిచూశాడు. వివరాళ్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ వద్దనున్న ఓ చెరువులో చేపలు పట్టడానికి పలువురు గ్రామస్తులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చెరువు కాంట్రాక్టర్ ఉపేందర్ రెడ్డి పరుగున అక్కడికి వచ్చి.. ఏకంగా రివాల్వర్ బయటకు తీసి బెదిరించాడు. అంతేకాదు.. నా చెరువు లూటీ చేస్తారా అంటూనే.. కాల్చి పడేస్తానంటూ హల్ చల్ చేశాడు. దీంతో చెరువులో చేపలు పట్టేందుకు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉపేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.






