- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Bharti Hot Comments: జగన్‌పై జరిగిన రాళ్ల దాడి డ్రామానే.. వైఎస్ భారతి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల రాళ్ల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల రాళ్ల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆ ఘటనపై వైఎస్ భారతి స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో జగన్‌పై దాడి డ్రామా అని ప్రతిపక్షాలు విమర్శించడం చాలా బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రామాలు ఆడాల్సిన అవసరం ఆయనకు లేదని తెలిపారు. నిజంగా డ్రామాలు ఆడాలి అని అనుకుని ఉంటే.. దెబ్బ తగిలిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి హంగామా చేసే వారు, కానీ జగన్ అలా చేయలేదు కదా అని మండిపడ్డారు. గతంలో జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు కూడ ప్రతిపక్ష నేతలు ఇలానే అన్నారని, అప్పుడు కూడ ఆయన హాస్పిటల్‌కి వెళ్లి హంగామా చేయలేదని పేర్కొన్నారు.
సరే ప్రతిపక్ష నేతలు అన్నట్టే.. సింపతీ ఓట్లతో గెలిచేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై దాడి చేయించుకున్నారు, ఆ దాడి డ్రామానే అని అనుకోండి, మీరు కూడ దాడి చేయించుకుని సింపతీ ఓట్లతో గెలవండి ఎవరైనా వద్దన్నారా..? అని ఎద్దేవ చేశారు.






