- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YCP, NDA: ఆ జిల్లాలో ఎదురుపడిన YCP, NDA అభ్యర్థులు.. చివరికి ఎవరూ ఊహించని ఘటన.?
ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

దిశ వెబ్ డెస్క: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు సార్వత్రిక ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. కాగా ఎన్నికల సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు, కూటమి నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గునమండుతోంది.
ఈ నేపథ్యంలో YCP, NDA ఎంపీ అభ్యర్థులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకొల్లులో జరిగిన ఒక కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం YCP ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అలానే ఎన్డీఏ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు.
కాగా ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇక అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడ అక్కడికి వచ్చారు. ఆయన కూడ ఉమాబాలకి షెక్‌హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. తమ మధ్య రాజకీయ విభేదాలకు తప్ప వ్యక్తిగత విభేదాలకు తావు లేదని ఈ నేతను నిరూపించారు.






