ఛీ..ఛీ మీరు నాయకులా..? ఆ నియోజకర్గంలో వైసీపీ నేతలను తరిమేసిన మహిళలు.. వీడియో వైరల్

by Indraja |   (  Updated:2024-05-12 19:37:27  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఛీ..ఛీ మీరు నాయకులా..? ఆ నియోజకర్గంలో వైసీపీ నేతలను తరిమేసిన మహిళలు.. వీడియో వైరల్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు, కానుకలు ఇవ్వడం చట్టరిత్యా నేరం. ఇది తెలిసి కూడ వైసీపీ మహిళలకు చీరలు పంచింది.

అయితే మహిళలు మాత్రం ఆ చీరలను విసిరి కొట్టారు. ఈ ఘటన కొత్తపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు మహిళలకు చీరలను పంచిపెట్టారు. కాగా ఆ మహిళలు వైసీపీ నేతల ఇంటికి వెళ్లి వాళ్ళ మోహన ఆ చీరలు విసిరి కొట్టి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తు్తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story