Deputy PM: జాతీయ రాజకీయాల్లో సంచలనం.. ఉప ప్రధానిగా నితీశ్ కుమార్?

by Prasad Jukanti |

బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను ఉప ప్రధానిగా చూడాలని ఉందని బీజేపీ నేత అశ్వినీ కుమార్ చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Deputy PM:  జాతీయ రాజకీయాల్లో సంచలనం.. ఉప ప్రధానిగా నితీశ్ కుమార్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను (Bihar CM Nitish Kumar) ఉప ప్రధాని చేయాలని అన్నారు. నితీశ్ కుమార్ ఉప ప్రధాని (Deputy Prime Minister) అయితే బిహార్ రాష్ట్రం నుంచి రెండో ఉప ప్రధానిగా నిలుస్తారన్నారు. గతంలో బిహార్ నుంచి జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా పని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు నితీశ్ కుమార్ ను ఉప ప్రధానిగా చేయాలని తాము కోరుకుంటున్నట్లు హాట్ కామెంట్స్ చేశారు.

వ్యక్తిగతమా? వ్యూహాత్మకమా?:

అశ్వినీ కుమార్ చౌబే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ (JDU) కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబడటం వెనకు తెలుగు దేశం పార్టీ తర్వాత జేడీయూ పార్టీది కీలక పాత్ర. అయితే బిహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి మధ్య రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అయితే బిహార్ లో అధికార పీటంపై తామే కూర్చోవాలని బీజేపీ చాలా కాలంగా ఎదురుచూస్తోందనే టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ మిత్రపక్షమైన జేడీయూకు చెందిన కీలక నేత, సీఎం నితీశ్ కుమార్ ను ఉప ప్రధాని పోస్టు ఇవ్వడం ద్వారా అతడిని జాతీయ రాజకీయాల్లోకి పంపాలని బీజేపీ ఆలోచన చేస్తోందా? తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి బీజేపీ వ్యక్తినే సీఎం సీట్లో కూర్చోబెట్టాలని చూస్తోదా? అనే ఉహాగానాలు తాజా పరిణామాలతో వ్యక్తం అవుతున్నది.

2004 నుంచి ఖాళీగా ఉప ప్రధాని పోస్టు:

నిజానికి ఉప ప్రధాని పదవి రాజ్యాంగబద్దంగా తప్పనిసరి కాదు. దాంతో 2004 నుంచి ఉప ప్రధాని పదవి ఖాళీగా ఉంది. అప్పటి వరుకు వివిధ ప్రభుత్వాల్లో ఆయా నేతలు ఉప ప్రధానులుగా చేసినా చివరగా ఎల్ కే అద్వానీ ఉప ప్రధానిగా పని చేశారు. ఈ క్రమంలో అశ్వినీ కుమార్ చౌజే (Ashwini Kumar Choubey) చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీజేపీ (BJP) వ్యూహాత్మకంగా ఈ లీకులు ఇస్తోందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Next Story