Pawan Kalyan సీఎం అవుతారా? తేల్చి చెప్పేసిన Astrologer Venu Swamy

by samatah |   (  Updated:2023-01-10 12:51:18  IST  )

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకోవడానికి, ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఆయనకు ఆశించిన ఫలితం

Pawan Kalyan సీఎం అవుతారా? తేల్చి చెప్పేసిన Astrologer Venu Swamy
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకోవడానికి, ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఆయనకు ఆశించిన ఫలితం రావడం లేదు. కానీ సినిమాలలో మాత్రం ఆయన మంచి సక్సెస్ సాధిస్తూ నెంబర్ వన్ దిశగా పయనిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్, సినీ కెరీర్ ‌కు సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై జ్యోతిష్యం అడగగా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నెంబర్ వన్‌గా ఉంటాడంట. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మాములు రేంజ్‌లో ఉండదు, సినిమాల్లో తిరుగే ఉండదని తెలిపారు. అలాగే పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ సీఎం కాలేరు కానీ మంత్రి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, పవన్ రెండు పడవల మీద నడవడం కంటే సినిమాలు లేదా రాజకీయం.. ఏదైనా ఒకటే ఎంచుకుంటే తిరుగుండదన్నారు.

Read more:

Pawan Kalyan బాటలో Srija.. Venu Swamy ఏం చెప్పారంటే ?

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్.. వేణు స్వామి క్లారిటీ

Next Story