టీడీపీ సభకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.. కాసాని జ్ఞానేశ్వర్

by Disha Web Desk 14 |
టీడీపీ సభకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.. కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతినిధుల సభలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 29న జరిగే టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను సోమవారం రాత్రి పరిశీలించారు. వీఐపీ గ్యాలరీ, పార్టీ ప్రతినిధులు కూర్చునే స్టాండ్స్, మీడియా గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, బారికేడ్లు, ఇతరత్రా నిర్మాణ పనులపై నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ పార్టీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా పాసులు జారీ చేయాలని, ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తిరునగరి జ్యోత్స్న, టీటీడీపీ మీడియా కో- ఆర్డినేటర్ బియ్యని సురేష్, అట్లూరి సుబ్బారావు, కాసాని వీరేశ్, బుగిడి అనూప్, బాలసుబ్రహ్మణ్యం, రవీంద్రా చారి, సాంబశివరావు, వెంజల కిషోర్, జోగేందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story