- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైవ్ డిబేట్‌లో మహిళా న్యూస్ యాంకర్‌కు అసభ్యకర సైగ చేసిన ప్రముఖ నాయకుడు.. రాజకీయంగా దుమారం రేపుతున్న వీడియో
లైవ్ డిబేట్‌లో మహిళా యాంకర్‌కు అసభ్యకరంగా చేతి సైగ చేశాడు ప్రముఖ నాయకుడు. ఓ పాపులర్ చానల్‌లో ఇంపార్టెంట్ ఇష్యూపై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. యాంకర్ అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా.. ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో

దిశ, వెబ్ డెస్క్ : లైవ్ డిబేట్‌లో మహిళా యాంకర్‌కు అసభ్యకరంగా చేతి సైగ చేశాడు ప్రముఖ నాయకుడు. ఓ పాపులర్ చానల్‌లో ఇంపార్టెంట్ ఇష్యూపై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. యాంకర్ అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా.. ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇలాంటి వాళ్లను డిబేట్స్ ఎందుకు పిలుస్తున్నారని.. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నాడని తిట్టిపోస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ నుంచి హిందువుల అక్రమ వలసల గురించి డిబేట్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ న్యాయవాది, టీఎంసీ ప్రతినిధి తౌసీఫ్ అహ్మద్ ఖాన్‌ను ఈ విషయంపై నిలదీసింది యాంకర్ రుబికా లియాకత్. దీంతో వాదించే బదులు, సమాధానం చెప్పే బదులు.. ఆమె వైపు చూస్తూ రెండు చేతులతో స్పష్టమైన లైంగిక సైగలు చేశాడు. రుబికా వెంటనే ఆగ్రహంతో లేచి అరిచింది. “ఇదేం ప్రవర్తన.. ఇక్కడి నుంచి వెళ్లిపో... జస్ట్ గెట్ ఔట్ ఆఫ్ మై షో! బడ్తమీజ్ ఆద్మీ.. గందే లోగ్... బేషరమ్!” అంటూ అరిచింది. కాగా తౌసీఫ్‌ను సిబ్బంది బయటకు తోసేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. టీఎంసీ పార్టీ ప్రవర్తన ఇలా ఉంటుందంటూ బీజేపీ విమర్శలకు దిగింది. అయితే టీఎంసీతో అతనికి సంబంధం లేదని చెప్తున్నారు ఆ పార్టీ నాయకులు.






