- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Video: కమ్యూనిస్ట్ లీడర్‌ను చెప్పుతో కొట్టిన మహిళా నాయకురాలు.. నడిరోడ్డుపైనే ఎందుకంటే?
పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు బేబీ కోలీ రెచ్చిపోయింది. తన సహచరులతో కలిసి సీపీఎం సీనియర్ నాయకుడు అనిల్ దాస్‌పై దాడి చేసింది. స్థానిక నివాసి దుర్గా సాహు గోడను అక్రమంగా కూల్చివేయడాన్ని దాస్ వ్యతిరేకించడం వల్లే

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు బేబీ కోలీ రెచ్చిపోయింది. తన సహచరులతో కలిసి సీపీఎం సీనియర్ నాయకుడు అనిల్ దాస్‌పై దాడి చేసింది. స్థానిక నివాసి దుర్గా సాహు గోడను అక్రమంగా కూల్చివేయడాన్ని దాస్ వ్యతిరేకించడం వల్లే ఈ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపైనే ఆయనను చెప్పుతో కొట్టడం, బట్టలు చింపడం, సిరా రంగు పోసి అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్నవారు సినిమా చూసినట్లు చూశారే తప్ప అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం శోచనీయం.
కాగా ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక బీజేపీ నాయకుడు అరూప్ దాస్, విపక్ష పార్టీలు టీఎంసీ నేతల తీరుపై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసకు ఇదే నిదర్శనమంటూ తీవ్రంగా విమర్శించారు. అయితే టీఎంసీ జిల్లా అధ్యక్షుడు సుజోయ్ హజ్రా, మాజీ ఖరగ్‌పూర్ ఎమ్మెల్యే ప్రదీప్ సర్కార్ కూడా ఈ దాడిని ఖండించారు. హజ్రా కోలీకి షో-కాజ్ నోటీసు జారీ చేసి.. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎంసీ ఈ చర్యలకు మద్దతు ఇవ్వదని పేర్కొన్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వివరణలను పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఇక దుర్గా సాహు కూడా గోడ కూల్చివేత విషయంలో కోలీపై ఫిర్యాదు చేశారు.
VIDEO






