NTR - అమిత్ షా భేటీకి అసలు కారణం ఇది.. కిషన్ రెడ్డి క్లారిటీ

by GSrikanth |
NTR - అమిత్ షా భేటీకి అసలు కారణం ఇది.. కిషన్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై వస్తోన్న రాజకీయ పుకార్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇద్దరి భేటీకి ప్రాధాన్యత లేదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సమావేశం అది అని అన్నారు. భేటీలో ఆర్ఆర్ఆర్ సినిమా, అందులో ఎన్టీఆర్ నటన, రానున్న తెలుగు సినిమాలు, పరిశ్రమకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి అమిత్ షా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి డిన్నర్ మీట్ అవ్వాలని అమిత్ షా కోరారని అన్నారు. అంతేగాక, వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డికి రిపోర్టర్లు గుర్తుచేయగా.. దానిపై తానేం స్పందించబోనని అన్నారు.

Next Story