రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. సిగ్గుండాలి అంటూ కేంద్రమంత్రి ఫుల్ ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-03 15:15:42  IST  )

టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు షామా మహమ్మద్(Shama Mohammed) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. సిగ్గుండాలి అంటూ కేంద్రమంత్రి ఫుల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు షామా మహమ్మద్(Shama Mohammed) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రోహిత్ శర్మ స్వార్థం లేని ఆటగాడు. దేశానికి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించారు. ఆయన ఫిట్ నెస్ గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది. ఆయన ఎలా ఉన్నా.. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించగలడు అని.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. తాజాగా షామా మహమ్మద్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మాండవీయ(Mansukh Mandaviya) స్పందించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని సూచించారు.

రాజకీయాల్లో కొనసాగుతూ బాడీ షేమింగ్ చేయడం ఏంటని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికల మీద దేశాన్ని ఎన్నో సార్లు రోహిత్ శర్మ గర్వపడేలా చేశారని.. అలాంటి వ్యక్తిపై మాట్లాడటం సిగ్గుచేటని సీరియస్ అయ్యారు. షామా మహమ్మద్‌తో పాటు ఆమె వ్యాఖ్యలను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌(TMC MP Saugata Roy)పైనా కేంద్రమంత్రి మాండవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంలో 93 ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటంపై బీజేపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు గెలవటం నేర్చుకోవాలని హితవు పలికింది. బీజేపీతో పాటు బీసీసీఐ(BCCI) కూడా షమా మహమ్మద్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story