- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందంగా తీర్చిదిద్దేందుకు ఎంతైనా ఖర్చు చేస్తాం.. CM సంచలన ప్రకటన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి(Uttar Pradesh CM) యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి(Uttar Pradesh CM) యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య, కాశీ, ప్రయాగ్‌రాజ్‌లను అభివృద్ధి చేశాం.. ఇక మథుర ఒక్కటే మిగిలి ఉందని అన్నారు. శ్రీకృష్ణ జన్మభూమి(Lord Krishna Birth Place)ని అందంగా తీర్చుదిద్దుతామని కీలక ప్రకటన చేశారు. మథుర అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తామని అన్నారు. మరోవైపు.. శ్రీకృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు వివాదం సుప్రీంకోర్టులో ఉంది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్(Aurangzeb) హయాంలో కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మథుర అభివృద్ధిపై సీఎం ప్రకటన చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. మహాకుంభ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణుడు భగవద్గీత(Bhagavad Gita)లో ఎవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనిపిస్తానని చెప్పాడు. ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఎవరికి ఎలా కావాలో అలా కనిపించింది. ఈ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్, ప్రపంచ మీడియా కూడా మెచ్చుకున్నారని యోగి అన్నారు. కుంభ్‌ను విమర్శించేవాళ్లకు సమాధానంగానే రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారు. హిందువులంతా ఒక్కటే అని ప్రపంచానికి చూపించారు. తప్పుడు వార్తలు రాసి కుంభ్‌ను ఆపాలనుకున్న వాళ్లకి ఇది సమాధానం. మేమంతా ఒక్కటే అని నిరూపించారని అన్నారు.






