- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిపై నెట్టింట అసభ్యకర ట్రోలింగ్.. మాజీ మంత్రి రోజా కొడుకు షాకింగ్ కామెంట్స్
వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి ఈ మధ్య మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. తన కొడుకును హగ్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు పంపించారని.. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యాడని చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి ఈ మధ్య మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. తన కొడుకును హగ్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు పంపించారని.. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యాడని చెప్పింది. ఇలాంటి ఆగడాలు ఆపాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో ఆ అబ్బాయి ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రోజా ఇతరుల పర్సనల్ విషయాల గురించి మాట్లాడటంపై తన ఉద్దేశాన్ని చెప్పుకొచ్చాడు ఆమె కొడుకు. పొలిటికల్ లీడర్స్ తప్పు చేసిన నాయకుడి గురించి మాట్లాడకుండా వాళ్ల ఫ్యామిలీని లాగడం చాలా పెద్ద మిస్టేక్ అని.. ఈ మధ్య అందరూ ఇదే చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ పద్ధతి మానుకోవాలని కోరుకున్నాడు. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. కొడుకుకు ఉన్న బుద్ధి తల్లికి లేదని కామెంట్స్ చేస్తున్నారు. అంటే మా అమ్మ తప్పు చేసిందని చెప్తున్నావా అని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు.
ఇక తన కెరీర్‌ను ఎలా మలుచుకోబోతున్నాడని అడగ్గా.. ఇరవై ఏళ్ల వయసు వచ్చే సరికి సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తానని, హీరోగా మారుతానని తెలిపాడు. ఆ తర్వాత అవకాశం చూసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులతో ఈ విషయం గురించి ఇప్పటికే చర్చించినట్లు చెప్పాడు. దీంతో నెటిజన్లు తన ముందు చూపు గురించి ప్రశంసిస్తున్నారు. యూత్ ఇలా లైఫ్‌ను డిజైన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.






