- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ సభలో రాజాసింగ్ అభిమానులు (వీడియో)
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు బహిరంగ సభకు విచ్చేశారు. ఇటీవల అరెస్ట్ అయి జైళ్లో ఉన్న బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. "వేర్ ఈస్ టైగర్ రాజాసింగ్" అంటూ బహిరంగ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. 'జై రాజాసింగ్.. జై జై రాజాసింగ్' అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. జైలు నుంచి ఎప్పుడు బయటకు తీసుకొస్తారని ప్లకార్డుల రూపంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని అభిమానులు ప్రశ్నించారు.
Next Story






