- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Narendra Modi: పసుపు రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ..
దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

దిశ వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాగా రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ పార్టీ ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పసుపు రైతులకు ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పసుపు బోర్డు పనులు తాత్కాలికంగా ఆగినట్లు తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాగానే, మొదటి 100 రోజుల్లో ఆగిపోయిన పసుపు బోర్డు పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలోని పసుపు రంగానికి ప్రోత్సాహాన్ని అందించేలా ఈ బోర్డు పని చేస్తుందని మోడీ తెలిపారు. అలానే పసుపు ఉత్పత్తి, వినియోగంలో అభివృద్ధి వంటి అంశాలపై ఈ పసుపు బోర్డు కృషి చేస్తుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.






