దళపతి విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

by Gantepaka Srikanth |

తమిళ అగ్ర కథానాయకులు దళపతి విజయ్(Thalapathy Vijay) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దళపతి విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్ర కథానాయకులు దళపతి విజయ్(Thalapathy Vijay) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుందో.. దాదాపు అక్కడ ఆయనది కూడా సేమ్ రేంజ్.. రీసెంట్‌గా విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. తాజాగా విజయ్ పార్టీపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి మాట్లాడారు.

ఇటీవల ఆయన ఓ తమిళ మీడియా(Tamil Media) ఛానల్‌కు ఇంట్వర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా దళపతి విజయ్ రాజకీయాల్లో దూకుడు పెంచారు.. మీరు ఆయన పార్టీని గమనిస్తున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నలకు పవన్ బదులిచ్చారు. మాట్లాడుతూ.. ‘నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఆయన పార్టీ గురించి వాళ్లు, వీళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. విజయ్(Vijay) అంటే నాకు చాలా గౌరవం ఉంది. రాజకీయాల్లో ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతో ఓపిక, సహనం ఉండాలి. అంతిమంగా అతనికి మంచి జరుగాలని కోరుకుంటా. ఒకే ఒక్కసారి కలిశాం’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను ఓవైపు విజయ్ ఫ్యాన్స్, మరోవైపు జనసైనికులు వైరల్ చేస్తున్నారు.

అంతేకాదు.. జనసేన పార్టీ(Janasena Party) తమిళనాడుకు విస్తరించే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు కూడా పవన్ కల్యాణ్(Pawan Kalyan) జవాబు చెప్పారు. తాను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను.. ఏదీ ఎలా జరగాలని ఉంటే.. అలా జరుగుతుంది. తమిళ ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీని విస్తరిస్తాను.. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు అని అన్నారు.

Next Story