Pawan Kalyan Serious on YSRCP: ఇదో ఉగ్రవాద చర్య.. ఆ ఘటనపై పవన్ కళ్యాణ్ ఫైర్..

by Indraja |

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరులో పర్యటిస్తున్నారు.

Pawan Kalyan Serious on YSRCP: ఇదో ఉగ్రవాద చర్య.. ఆ ఘటనపై పవన్ కళ్యాణ్ ఫైర్..
X

దిశ వెబ్ డెస్క్: నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరులో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు బూతులు, గోతులు, దాడులు తప్ప ఏపీ ప్రజలకు ఏం ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. తాను పొన్నూరుకు వస్తున్నానని తెలిసి, హెలిప్యాడ్‌ను ధ్వశం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలు చేసిన ఈ పని ఉగ్రవాద చర్య అని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మట్టిని అన్ని 2 వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు విరగకొట్టి మడత మంచంలో కుర్చోపెడతా అని హెచ్చరించారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుంటూరుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరుకు రానున్న పవన్ హెలికాఫ్టర్ ల్యాండిగ్ కోసం పొన్నూరులో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలీప్యాడ్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో జేసీబీని ఉపయోగించి ధ్వంశం చేసిన విషయం తెలిసిందే.

Next Story