బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. కర్రలు, పార్టీ జెండాలు, రాళ్లతో దాడులు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-29 09:48:12  IST  )

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాహుల్ గాంధీ దర్భంగాలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా.. ఆ పార్టీకి చెందిన వ్యక్తి రఫీక్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన తల్లిపై అగౌరవ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు

బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. కర్రలు, పార్టీ జెండాలు, రాళ్లతో దాడులు..
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాహుల్ గాంధీ దర్భంగాలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా.. ఆ పార్టీకి చెందిన వ్యక్తి రఫీక్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన తల్లిపై అగౌరవ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. కాగా కాంగ్రెస్ కార్యాలయం సదాకత్ ఆశ్రమ్ ఎదుట బీజేపీ నిరసన తెలపడంతో ఈ గొడవలు మొదలయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పార్టీ జెండాలు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా రాహుల్ గాంధీ, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఈ ఘటనను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు.

VIDEO

Next Story