- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భట్టి పాదయాత్రకు ఒక రోజు బ్రేక్..
గత 62 రోజులుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు గురువారం ఒక రోజు బ్రేక్ పడనుంది.

X
దిశ, జడ్చర్ల: గత 62 రోజులుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు గురువారం ఒక రోజు బ్రేక్ పడనుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి గురువారం కర్ణాటక ముఖ్యమంత్రిగా బెంగళూరులో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నందున ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందడంతో గురువారం పీపుల్స్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి భట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళనున్నారు. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి మహబూబ్ నగర్ జిల్లాలో నవాబుపేట మండల కేంద్రానికి చేరుకొని శుక్రవారం యధావిధిగా పాదయాత్రను కొనసాగయించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
Next Story






