- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New Parliament building inauguration :పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఒవైసీ ఫైర్
నూతన పార్లమెంట్ భవనం శవపేటిక ఆకారంలో ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీకి ఓ స్టాండ్ అంటూ ఏమీ లేదని ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పార్లమెంట్ భవనం శవపేటిక ఆకారంలో ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీకి ఓ స్టాండ్ అంటూ ఏమీ లేదని ధ్వజమెత్తారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆర్జేడీ శవపేటిక అని ఎందుకు పిలుస్తోందని నిలదీశారు. ఆ పార్టీ ఇంకేమైనా మాట్లాడి ఉండవచ్చు. కానీ కొత్త భవనం విషయంలో ఈ కోణం తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదని గుర్తు చేశారు.
అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికార విభజనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని స్పీకర్ చేత కాకుండా ప్రధాని ప్రారంభించడం సరికాదని ఆరోపిస్తూ ఎంఐఎం పార్టీ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంది.
Read More: శవపేటికలా పార్లమెంట్ అంటూ ట్వీట్.. ఆర్జీడీపై బీజేపీ ఆగ్రహం






