Delhi Elections: ఆప్‌ను ఓడించాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలి.. కేజ్రీవాల్ పాత వీడియో వైరల్

by Yella Dhawani Reddy |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దశాబ్దాల పాలనకు ముగింపు పలికి.. 27 ఏళ్ల తర్వాత తొలిసారి భారతీయ జనతా పార్టీ (BJP) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

Delhi Elections: ఆప్‌ను ఓడించాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలి.. కేజ్రీవాల్ పాత వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దశాబ్దాల పాలనకు ముగింపు పలికి.. 27 ఏళ్ల తర్వాత తొలిసారి భారతీయ జనతా పార్టీ (BJP) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక ఈ ఎన్నికల్లలో ఆప్ అగ్ర నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal), మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్‌ (Satyandra Jain), తదితరులు ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 4వ సారి పోటీ చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ వర్మ చేతిలో ఘోర పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.

2023లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అరవింద్ కేజ్రివాల్ మాట్లాడారు. 'దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కలలు కంటున్నారు. ఎన్నికల్లో తమని ఓడించలేరని వాళ్లకి తెలుసు.. అందుకే ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు పన్నుతున్నారు' అని ఆయన అన్నారు. ప్రధానికి తాను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నానని, ఆయన తమ పార్టీని ఈ జన్మలో ఓడించలేరని, అందుకోసం ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాలని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Next Story