MLA Venkata Ramana Reddy: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని చూసి సీఎం భయపడుతున్నారు.. ఎందుకు..?

by Maddikunta Saikiran |
MLA Venkata Ramana Reddy: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని చూసి సీఎం భయపడుతున్నారు.. ఎందుకు..?
X

దిశ, వెబ్‌డెస్క్ :గత నెల 23న మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈ సమావేశాలలో అధికార,విపక్ష సభ్యులు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..."నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలకు ఏం చేస్తామని చెప్పకుండా.. కేవలం గత BRS ప్రభుత్వాన్ని తిట్టడానికే సమావేశాలు నిర్వహించారని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని,MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని చూసి రేవంత్ బయపడుతున్నారని, కేవలం పాతబస్తీకే రూ. 300 కోట్లు ఎలా ఇస్తామన్నారని" రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడటం బాధాకరమని, బ్లాక్ టికెట్‌‌‌లు అమ్ముకునే వారు కూడా మంచిగా మాట్లాడుతారని విమర్శించారు. మంత్రుల పేషీలో రిటైర్ అయిన వారిని నియమించుకుంటున్నారని,వారికి వృత్తి పట్ల ఏం భయం ఉంటుందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని,కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? ఇవ్వలేదా? ఈ విషయాన్నీ స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వంపై చాలా అప్పులున్నాయని ముఖ్యమంత్రి, మంత్రులు అన్నారని.. లక్షన్నర కోట్లతో మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారని ,ప్రజా సమస్యలపై సభలో ఏం చర్చించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed