- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకా లేక ఫ్యామిలీ ఫంక్షనా.. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని అలిగిందని.. అందుకే కలెక్టరేట్ అధికారులపై ఫైర్ అయిందని

దిశ, వెబ్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని అలిగిందని.. అందుకే కలెక్టరేట్ అధికారులపై ఫైర్ అయిందని చర్చ జరిగింది. మొత్తానికి ఈ విధంగా ఆమె ట్రెండ్ అయింది. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ ఆడియో రిలీజ్ చేసింది ఎమ్మెల్యే. ‘79వ స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకలకు కలెక్టరేట్ నుంచి నాకు, నా కుటుంబానికి ఇన్విటేషన్ అందింది. నాతోపాటు జిల్లాలోని ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. కానీ నేను కూర్చునే ప్లేస్‌లో కలెక్టర్, పోలీసులకు చెందిన కుటుంబాలకు చెందిన వారు కూర్చున్నారు. వారిని లేపి నేను కూర్చోవడం బాగోదని అనిపించింది. అలాగే ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యుల పండుగగా భావించి.. అక్కడి నుంచి వెనుదిరిగా’ అని క్లారిటీ ఇచ్చింది.






