రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలుసు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Javid Pasha |
రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలుసు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందని, రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడని ఊహించుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పిచ్చి మాటలు మానుకోవాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన కరువు, వలసలను మాత్రమే పాలమూరు జిల్లా చూసిందన్న మంత్రి.. కేసీఆర్ సీఎం అయ్యాక పాలమూరు పచ్చబడుతోందని అన్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరులో వలసలు తగ్గి వేరే రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస కార్మికులు వస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఇదంతా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్లేనని స్పష్టం చేశారు.

ఇక బీజేపీపై కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో దేశం వెనుకబడి పోయిందన్నారు. ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం ప్రధాని మోడీ పనితనానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డిజిల్ ధర డబుల్ చేసిన ఏకైక ప్రధాని మోడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఎల్ఐసి డబ్బులు అదానీ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల డబ్బును ప్రైవేట్ కంపెనీ లో పెట్టడానికి మోడీ ఎవరు? అని నిలదీశారు.

Next Story

Most Viewed