మమ్మల్ని భాగమవ్వనియ్యండి : ఎన్నికల కమిషనర్ కు నటుడు విజయ్ విజ్ఞప్తి

by Thanuru Gopichand |

తమిళనాడులో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ కోరింది.

మమ్మల్ని భాగమవ్వనియ్యండి : ఎన్నికల కమిషనర్ కు నటుడు విజయ్ విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ కోరింది. ఇటీవల భారత ఎన్నికల కమిషన్ కు సింబల్ (Symbol) కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సన్నాహక సమావేశాలకు టీవీకే కూడా ఆహ్వానించాలని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Joseph Vijay) కోరారు. భారత ఎన్నికల కమిషనుకు శనివారం లేఖను రాశారు. ఎన్నికల పారదర్శకత, సమగ్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన అనే లక్ష్యంతో తమ పార్టీ కూడా ఎన్నికల సన్నాహక చర్చల్లో భాగమవ్వాలని కోరుకుంటోందని ఎన్నికల కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

పారదర్శకత, భాగస్వామ్య సూత్రాలను కాపాడడంలో భాగంగా తమిళనాడులో జరగబోయే ఎన్నికల (Tamilnadu Elections) ఏర్పాట్లకు సంబంధించిన అన్ని సమావేశాలు, చర్చలు, సమన్వయ కార్యక్రమాలకు మా టీవీకే పార్టీని కూడా ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రజాప్రాతినిధ్య స్ఫూర్తితో జరిగేందుకు మేము మా సహకారం, సలహాలు, క్షేత్ర స్థాయి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం,” అని విజయ్ తన లేఖలో (Letter) పేర్కొన్నారు.

అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం తమ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం, తమిళనాడు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌కి (Chief Electoral Officer) తెలియజేసి వారికి తగిన దిశానిర్దేశం చేయాలని విజయ్ కోరారు. ఈ అభ్యర్థన ఎవరికీ నష్టం కలిగించేది కాదని, అది ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉపయోగపడుతుందని తన లేఖలో తెలిపారు.

అయితే సెప్టెంబర్, 2025 కరూర్ లో టీవీకే పార్టీ బహిరంగ సభ జరిగింది. లక్షలాది మంది తరలివచ్చిన ఈ సభలో దుర్ఘటన జరిగింది. సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా గాయపడ్డారు. ఇటువంటి సందర్భంలో విజయ్ పోటీకి ఆసక్తి కనబరచడం చర్చనీయాంశంగా మారింది.

Next Story