రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పోల్చిన కమల్ హాసన్

by Disha Web Desk 2 |
రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పోల్చిన కమల్ హాసన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయానికి అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. మహాత్మాగాంధీలా రాహుల్ గాంధీ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని.. విశ్వసనీయమైన మీ విధానం ప్రజలకు స్వచ్చమైన గాలిని అందించిందన్నారు. విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించి మీపై విశ్వాసం ఉంచారని అన్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కమల్ హాసన్ కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమలో ఇటీవల తమిళనాడులో జరిగిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలోనూ కమల్ హాసన్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. అంతకు ముందు భారత్ జోడో యాత్రలోనూ రాహుల్‌కు మద్దతుగా కమల్ పాదయాత్రలో నడిచారు. దీంతో కమల్ హాసన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా లేక కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయబోతున్నారా అనేదానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కమల్ హాసన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి:

కాంగ్రెస్ కు ప్రధాని మోడీ కంగ్రాట్స్

Next Story