ముద్రగడ ఉచిత సలహాలు మానుకోవాలి.. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్

by Javid Pasha |   (  Updated:2023-06-20 10:26:58  IST  )

జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖను రాయడాన్ని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ఖండించారు.

ముద్రగడ ఉచిత సలహాలు మానుకోవాలి.. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖను రాయడాన్ని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ఖండించారు. పవన్ కల్యాణ్‌ను ఆయన కుటుంబ సభ్యులను ద్వారంపూడితో పాటు పలువురు వైసీపీ నేతలు బూతులు తిట్టినప్పుడు ముద్రగడ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు తిడితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

అప్పుడెందుకు వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించలేదని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఇతరులకు ప్రశ్నలు వేయడం, సలహాలు ఇవ్వడం ఆపేసి... మనమెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ హితవు పలికారు.

Next Story