బీజేపీకి నితీశ్ కుమార్ షాక్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-22 11:12:45  IST  )

మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ షాకిచ్చారు.

బీజేపీకి నితీశ్ కుమార్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వానికి సీఎం నితీశ్ కుమార్ షాకిచ్చారు. మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి జనతాదళ్ యునైటెడ్(JDU) మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు JDU అధికారిక లేఖ విడుదల చేసింది. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత JDU తరపున గెలిచి బీజేపీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల విషయాన్ని కూడా లేఖలో హైలైట్ చేసింది. ప్రస్తుతమున్న ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్ధుల్ నాసిర్ ఇకపై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో పాల్గొంటారని తెలిపింది.

అయితే, ఈ పరిణామం అక్కడి ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ, కేంద్రంలోని BJP ప్రభుత్వానికి JDU కీలక మితపక్షంగా ఉంది. ప్రస్తుతం JDUకి 12 మంది ఎంపీలు ఉన్నారు. వీరు BJPకి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత ఈ పరిణామంతో కేంద్రంలోని బీజేపీకి ఒక సందేశంగా మారిందనే చర్చ నడుస్తోంది.

మరోవైపు బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మేఘాలయా అధికార పార్టీ కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని NPP కూడా గత నవంబరులో మద్దతు ఉపసంహరించుకుంది. ఇక, మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలుండగా, BJPకి 37 మంది ఎమ్మెల్యే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 31. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా BJPకి ఉంది. దీంతో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

Next Story