- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Politics: ఓటర్లను మభ్యపెట్టడం దుర్మార్గం.. జేడీ లక్ష్మీనారాయణ
పోస్టల్ బ్యాలెట్ ఓటర్‌ల యొక్క పూర్తి వివరాలు ఒక అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఆర్‌వో అందించడం దుర్మార్గపు చర్య

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్ ఓటర్‌ల యొక్క పూర్తి వివరాలు ఒక అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఆర్‌వో అందించడం దుర్మార్గపు చర్య అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని, అది స్పష్టంగా అర్థం అవుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
మిగిలిన పార్టీల అభ్యర్థులకు మాత్రం ఆ వివరాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని స్వయంగా అభ్యర్థి అడిగినా కూడా అనేక కారణాలు చెప్పి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏయూ క్యాంపస్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు బార్లు తీరారు. అదే సమయంలో పోలింగ్ బూత్‌ను సందర్శించిన జెడి అక్కడి ఓటర్లు కలిసి కొన్ని వాస్తవాలు తెలుసుకొని షాక్‌కు గురయ్యారు.
అక్కడ ఓటర్లు సమాచారం ప్రకారం 7670 807307 అనే నెంబర్ నుండి ఫోన్ చేసి మీరు ఓటు కేకే రాజు వేశారా? ఒకవేళ వేయకపోతే కేకే రాజుకి ఓటు వేయాలని ఓటర్లు మభ్య పెడుతున్నారని వారు వాపోతున్నారు. కొంతమంది ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఫోటో తీసి అధికార పార్టీ కార్యకర్తలకు పంపగా ఆ ఓటర్‌కు ఫోన్ ద్వారా డబ్బులు ట్రాన్ఫెర్ చేస్తున్నారని తెలిసింది.
ఈ విషయాలపై జేడీ లక్ష్మీనారాయణ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన వెంటనే తగు చర్యలు తీసుకుంటూ పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్ అనుమతిని నిరాకరించారు. ఎట్టి పరిస్థితులలోనూ ఓటర్లు సెల్‌ఫోన్‌ను పోలింగ్ బూత్‌లోకి తీసుకు రానివ్వకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా అధికార పార్టీ ప్రభుత్వ అధికారులు సహాయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు జేడీ ఆరోపించారు.






