- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగ్గారెడ్డి గెలిచేవరకు ఆ పని చెయ్యనన్న అభిమాని.. అందుకు ఆయన ఏమన్నారో తెలుసా..?
సినిమా హీరోలకు అభిమానులు ఉన్నట్టే రాజకీయ నేతలకు కూడా అభిమానులు ఉంటారు.

దిశ వెబ్ డెస్క్: సినిమా హీరోలకు అభిమానులు ఉన్నట్టే రాజకీయ నేతలకు కూడా అభిమానులు ఉంటారు. అయితే కొంతమంది అభిమానులు తమ నాయకుడే సర్వం అని అనుకుంటారు. ఎవరైనా తమ నాయకుడిని ఏమైనా అంటే ఉవ్వెత్తున ఎగసిపడతారు. తమ నాయకుడి కోసం ఏం చెయ్యడానికైనా వెనకాడరు. అలాంటి అభిమానులను కలిగిన నేతలు చాల అరుదు.
సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ కోవలోకే వస్తారు. తాజాగా తమ ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి మళ్ళీ గెలిచేవరకు తాను చెప్పులు తొడగనని ఓ అభిమాని శపథం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ అభిమానికి హితబోధ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తాను, తన భార్య చెప్పులు వేసుకుని తిరుగుతున్నామన్నారు.
అలాంటిది నీకెందుకు అంత బాధ అని అన్నారు. నీకు ఏమైనా అయితే నేను హాస్పిటల్ వరకే రాగాలను.. డబ్బులు ఇవ్వగలను అంతేకాని నీ వెంట రాలేను కదా అన్నారు. అభిమానం మనసులో ఉంటే చాలు, ఇలా చెయ్యొద్దు అని అభిమానికి నచ్చ చెప్పారు.






