- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్, కేటీఆర్, రేవంత్‌లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై టీడీపీ అధినేత చంద్రబాబు మనసులోని మాట బయటపెట్టారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన 'నిజం విత్ స్మితా' టాక్‌లో ఇటీవల చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కొందరి వ్యక్తులు పేర్లు చెప్పిన స్మిత వారిపై చంద్రబాబుకు ఉన్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
అందులో భాగంగా లోకేష్ గురించి అడగ్గా.. బాగా చదువుకున్న సంస్కారం ఉన్న వ్యక్తి అని, భవిష్యత్‌ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేటీఆర్ గురించి అడిగితే.. ఓ స్ట్రాటజీ ప్రకారం.. అనుకున్నది సాధించుకునే వ్యక్తిగా కితాబిచ్చారు. అంతేగాక, బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ కేటీఆర్‌ను పొగిడారు. పవన్ కల్యాణ్ గురించి అడగ్గా.. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తిగా చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రస్తావన తీసుకురాగా.. రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్లే వ్యక్తి అని... ప్రజల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉందన్నారు.






